Wednesday 18 February 2015

Letter to Namaste Telangana news paper...


http://epaper.namasthetelangaana.com/epapermain.aspxedcode=9&eddate=2/18/2015%2012:00:00%20AM&querypage=4


Saturday 14 February 2015

తన జ్ఞాపకాలు...

తన అడుగుల జ్ఞాపకాలు


పున్నమి వెన్నెల్లో, విచ్చుకున్న మల్లెపూలలాంటి పాదాలతో
తను వేసే అడుగులు మల్లెలల్లోని మెత్తదనాన్ని గుర్తుచేస్తున్నాయి
అమావాస్య చీకట్లో వెలిగే దీపావళి దీపాలలాంటి ఆమె పాదాల వెలుగులోనే 
నా మనసులోని ఆశలన్నీ కనిపిస్తున్నాయి.
పట్టీలున్న తన పాదాలతో నా హృదయ వీణపై పరిగెడుతూ
ఎదో సంగీతాన్ని పలికిస్తోంది.
నా మనసుపై తను వేసే ప్రతి అడుగూ ఒక చెదరని జ్ఞాపకంలా నిలిచిపోతోంది,
ఎందుకంటే తన అడుగులు, తన జ్ఞాపకాలు నాకు ఎంతో ప్రత్యేకం.

Inspiration...

రగిలే ఆశయం...


రగిలే ఆశల మసిలే ఆశయాలతో పోటెత్తే కన్నీళ్లు...
వడివడిగా విడివిడిగా బిగుసుకు పోయే ఉక్కు కండరాల గుండె...
కరిగిస్తాయి కదిలిస్తాయి ఉక్కు శిఖరాలని,
మండిస్తాయి మసి చేస్తాయి ఎదురయ్యే అవరోధాలని.
ఒక జీవితం ఒక గొప్ప ఆశయంతో వేసే ఒక్క అడుగు...
గడ్డ కట్టిన మంచు రాళ్లల్లో మంటలు పుట్టిస్తుంది,
కారు మబ్బుల్లోంచి నిప్పు రవ్వలు రాల్చుతుంది.

my grandMOTHER

మా నానమ్మకు వందనాలు



మొత్తం నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిపి మా నానమ్మకు పన్నెండు మంది మనవళ్ళు, ఏడుగురు మనవరాళ్ళు, పది మంది మునిమనవళ్లు, ముగ్గురు మునిమనవరాళ్ళు. నాకు జ్ఞాపకమున్నంతవరకు అందరికి ఉగ్గుపాలు తనే పట్టింది, అందరి ఉయ్యాలలు తనే ఊపింది. అందరి చిన్ననాటి సపర్యలు ఆమే చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. నా చిన్న వయస్సులోనే మా అమ్మ చనిపోవడం వల్ల ఆమె నాకు అన్నీ తానై చూసుకునేది. తెల్లవారుఝామునే లేచి  విశాలమైన మా ఇంటి వాకిలిని ఊడ్చేది. తర్వాత ఇంట్లో ఒక్కో గదిని ఊడుస్తూ మమ్మల్నందరినీ తనే నిద్రలేపేది. ఆదివారమొచ్చిందంటే కుంకుడుకాయ రసంతో మాకు తలస్నానాలు చేయించడానికి సిద్దంగా ఉండేది. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం పరితపించిపోయేది. అన్ని వంటపనులు తనే దగ్గరుండి చూసుకొనేది, పెదనాన్న, నాన్న, బాబాయ్ లకు అవసరమైన సలహాలిస్తూ కనిపించేది. అమ్మలేని లోటు మాకు రానీయకుండా చూస్తోంది. మా తర్వాతి తరమైన తన మునిమనవల, మునిమనవరాళ్ళ బాగోగులు తనే చూసుకుంటోంది. అలాంటి నానమ్మకు మనవడిగా పుట్టడం నిజంగా నా అదృష్టం, అది తీర్చుకోలేని ఋణం. ఇంతమందికి ఇన్ని చేసి, ఇంకా చేస్తున్న మా నానమ్మకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాకపోవడం బహుషా ఆమె కష్టపడేతత్వం చూసి దేవుదు తనకిచ్చిన వరం అనుకుంటా! ప్రస్తుతం మా నానమ్మ వయస్సు సుమారు ఎనభై సంవత్సరాలు. వంద సంవత్సరాలకు మించి ఆమె ఆరోగ్యంగా ఉండాలనేదే దేవుడికి  మా నిరంతర ప్రార్థన.