Sunday, 22 April 2012
LOVE in NUMBERS
ఒకటే ఆలోచన,
అదే రెండు హృదయాలను కలిపేలా,
ముక్కోటి దేవతల సాక్షిగా
నాలుగు గదుల నా హృదయంలో
పంచ ప్రాణాలను మించిన
ఆరోప్రాణంగా
ఏడు క్షణాల నీ కొలువు కోసం
ఎనిమిది దిక్కులను ప్రార్థిస్తున్నాను.
నవ వధువులా వచ్చి,
పది కాలాలు కలిసుంటావని.
నీ గురించి...
పంచామృతమయమైన నీ పేరు పలకాలంటే
పంచమరాగంతో కోకిల రావాలి.
మదిమదినీ మురిపింప చేయాలంటే
మృదుమధురమైన నీ మాట వినాలి.
ఎగిసే అలలు ఆగాలంటే సొగసైన
నీ కురులు చూపాలి.
మండే సూర్యుడు మంచుగా మారాలంటే
మల్లెల్లాంటి నీ కళ్ళు విచ్చుకోవాలి.
అలుపు....
అలుపు
అలలకు లేని అలుపు మనిషికెందుకు !
ఆశయం లేని జీవితమెందుకు ?
కలలు కనని కల్లెందుకు !
ఆ కలలను సాకారం చేసుకొనని సోమరి బ్రతుకెందుకు ?
ఆలోచించని మనసు ఎందుకు !
ఆప్యాయత లేని హృదయం ఎందుకు ?
ఆశలు లేకుండా శ్వాసించడమెందుకు?
ఆకాంక్షలు లేకుండా జీవించడమెందుకు ?
Subscribe to:
Posts (Atom)